Tirupati: పుత్తూరు మున్సిపాలిటీ సమావేశం రసాబాస

ABN , First Publish Date - 2022-05-31T19:48:02+05:30 IST

పుత్తూరు మున్సిపాలిటీ సమావేశంలో రసాబాస జరిగింది. కోరం లేక పోయినా బిల్లులు పాస్ చేసుకునేందుకు వైసీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ హరి యత్నించారు.

Tirupati: పుత్తూరు మున్సిపాలిటీ సమావేశం రసాబాస

తిరుపతి: పుత్తూరు మున్సిపాలిటీ సమావేశంలో రసాబాస జరిగింది. కోరం లేక పోయినా బిల్లులు పాస్ చేసుకునేందుకు వైసీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ హరి యత్నించారు. దీన్ని టీడీపీ ఫ్లోర్ లీడర్ జీవరత్నం నాయుడు అడ్డుకున్నారు. వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ హరి తీరుపై అసంతృప్తితో 9 మంది వైసీపీ సభ్యులు సమావేశానికి గైర్హాజరయ్యారు. "రెండు రేపులే కదా" అని మంత్రి రోజా.. మహిళలను కించపరుస్తూ మాట్లాడటంపై నిరసనగా... మహిళలకు మంత్రి క్షమాపణ చెప్పాలని టీడీపీ కౌన్సిలర్లు బాయ్ కాట్ చేశారు. అయితే కోరం లేక పోయినా బిల్లులను కోరం ఉన్నట్టు పాస్ చేసుకోవాలని పుత్తూరు కౌన్సిల్ చూసింది.  విషయం తెలిసిన టీడీపీ ఫ్లోర్ లీడర్ జీవరత్నం నాయుడు...  పుత్తూరు మున్సిపాలిటీ ఛైర్మన్ హరిని నిలదీశారు. దీంతో పుత్తూరు మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 


Updated Date - 2022-05-31T19:48:02+05:30 IST