అనంతపురం: రాష్ట్రంలోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వంశీతో తమకేం సంబంధమని, ఆయన ఏ వంశీ అని ఎదురు ప్రశ్న వేశారు. టీడీపీ బీఫాం మీద వల్లభనేని వంశీ గెలిచినాడని ఆయన పేర్కొన్నారు. ఆయన గిచ్చినాడు అని ఈయన ఏడుస్తున్నాడని ఎమ్మెల్యే శ్రీధర్ అన్నారు. వైసీపీ బీ ఫాంతో గెలిచిన ఏ ఎమ్మెల్యే అయినా చంద్రబాబును కించపరిచరా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును కించపరిచింది ఒకే ఒక్కడు వల్లభనేని వంశీ అనేవాడు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడికి, మాకు ఏం సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే గిచ్చితే చంద్రబాబు ఏడుస్తున్నాడని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడ చంద్రబాబు ఏడిస్తే ఇక్కడ పల్లె రఘునాథరెడ్డి గౌరవసభ అనే పేరుతో ఊర్ల మీద తిరుగుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.