కొనసా..గుతున్న విచారణ..!

ABN , First Publish Date - 2021-07-24T06:01:59+05:30 IST

పుట్టపర్తి పట్టణంలో అక్రమాల డొంక కదల్లేదు సరికదా... కనీస ప్రయత్నాలు చేసినట్లు కూడా కనిపించడం లేదు. ఐదు నెలలుగా విచారణ కొనసాగుతూనే ఉంది. నేటికీ దానిపై విచారణ నివేదిక ఇచ్చిన పాపాన పోలేదు.

కొనసా..గుతున్న విచారణ..!

పుట్టపర్తిలో అక్రమాల 

నిగ్గు తేలేదెన్నడు..?

ఐదు నెలలైనా నివేదిక ఇవ్వని వైనం

విచారణాధికారికే..

ఉన్నతాధికారిగా నియామకం

రాష్ట్రస్థాయి అధికారుల వత్తాసు

అనంతపురం కార్పొరేషన, జూలై23: పుట్టపర్తి పట్టణంలో అక్రమాల డొంక కదల్లేదు సరికదా... కనీస ప్రయత్నాలు చేసినట్లు కూడా కనిపించడం లేదు. ఐదు నెలలుగా విచారణ కొనసాగుతూనే ఉంది. నేటికీ దానిపై విచారణ నివేదిక ఇచ్చిన పాపాన పోలేదు. పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ (పుడా)ను 1992లో ఏర్పాటు చేశారు. ఆ త ర్వాత పట్టణంలో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా వెలిశాయి. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటైన తరువాత అక్రమ భవనాలకు అడ్డూఅదు పూ లేకుండా పో యింది. కనీసం 10 అడుగులు కూడాలేని రోడ్డులో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు ఉన్నాయంటే ఏ స్థాయిలో అక్రమాలు సాగాయో అ ర్థం చేసుకోవచ్చు. నిబంధనలు ఉల్లంఘించి, నిర్మించిన భారీ భవనాల పై నేటికీ నిగ్గుతేల్చలేకపోతున్నారు. ఫిర్యాదు చేయడం... విచారణ వే యడంతోనే మమ అనిపిస్తున్నారు. నివేదికలు కూడా ఇవ్వలేని స్థితిలో అధికారులున్నారు. ముడుపులు పుచ్చుకుని, చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈసారి ఏకంగా వి చారణాధికారినే పుడా ఉన్నతాధికారిగా నియమించడం గమనార్హం. అ క్కడ గతంలో(అక్రమ నిర్మాణాల సమయంలో) పనిచేసిన ఓ అధికారి దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లి, అక్కడి నుంచి మరో జిల్లాలో అసిస్టెంట్‌ సిటీప్లానర్‌(ఏసీపీ)గా సెటిలయ్యారు. ఇదంతా డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన అండ్‌ కం ట్రీప్లానింగ్‌ (డీటీసీపీ)లో రాష్ట్రస్థాయి అధికారుల వత్తాసు పుణ్యమేనని తెలుస్తోంది. వారి అండతో అక్రమార్కులు తప్పించుకుంటున్నారని సమాచారం.


ఇన్ని నెలలు ఏం చేసినట్లు..?

పుట్టపర్తి చిన్న పట్టణం. భవనాలు నిర్మించాలంటే నిబంధనల మేరకు 30 అడుగుల రోడ్డుండాలి. 10 అడుగులు కూడాలేని రోడ్డు పక్కనే 11 అంతస్తుల భవనాలు వెలిశాయి. 2015 నుంచి సాగిన అక్రమ భవన నిర్మాణాలకు అప్పటి అధికారులు రూ.లకారాల్లో ఆమ్యామ్యాలు పుచ్చుకుని, అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. ఈ అవినీతి బాగోతాలపై గతేడాది ఫిబ్రవరి 22న అప్పటి మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ (ఆర్‌డీ) రవీంద్రబాబు.. ప్రభుత్వం, ఏసీబీకి లేఖ రా శారు. ఆ తరువాత దాదాపు ఏడాదికి అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో మున్సిపల్‌ పట్టణాభివృద్ధి సంస్థ (ఎంఏయూడీ) ఆదేశాల మేరకు వెంటనే పుడా అక్రమాలపై విచారణ చేపట్టాలని టౌనఅండ్‌ కంట్రీప్లానింగ్‌ (ఆర్‌డీడీటీపీ) రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ దేవీకుమారికి ఆదేశాలందాయి. విచారణ ఇప్పటివరకూ ఒక్క అడుగు కూడా ముం దుకు పడినట్లు కనిపించడం లేదు. ఆ భవనం నిర్మించిన బిల్డర్‌ ఎవరు...? అనుమతి ఎవరిచ్చారు...? నిబంధనలేంటి...? లాంటి విషయాలు తేలడానికి ఐదునెలల సమయం తీసుకోవడంలో ఆంతర్యం ఏంటో అంతుబట్టడం లేదు. బిల్డర్‌, అనుమతిచ్చిన అధికారి తెలిస్తే చాలు అంతా తేలిపోతుంది. ఈ క్రమంలో విచారణను సాగదీస్తున్నారా...? అటకెక్కించారా...? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


విచారణాధికారే ఉన్నతాధికారిగా...!

పుడా అక్రమాలు ఎప్పుడు నిగ్గు తేలుస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. విచారణ అధికారినే పుడా ఉన్నతాధికారిగా నియమించడంపై భిన్నాభిప్రాయాలు వ్య క్తమవుతున్నాయి. అప్పట్లో విచారణ వేయగా... అక్కడ పనిచేస్తున్న ఉన్నతాధికారి దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లా రు. అక్కడ ఆ ఉన్నతాధికారి పోస్టు ఖాళీగా ఉన్న సమయంలో జిల్లాలో డీటీపీసీలో పనిచేస్తున్న మరో అధికారిని ఇనచార్జ్‌గా నియమించారు. విచారణ అధికారిగా ఉన్న ఆర్‌డీడీటీపీ దేవీకుమారిని ఏప్రిల్‌ 27న పుడా వైస్‌చైరపర్సనగా నియమించడం గమనార్హం. ఇదివరకు ఇనచార్జ్‌గా నియమించే అధికారికి సైతం అక్రమ భవన నిర్మాణాల్లో భాగస్వామ్యమున్నట్లు సమాచారం. డీటీపీసీలో రాష్ట్రస్థాయి అధికారుల అండతో ఇష్టారాజ్యంగా సీట్లమార్పు సాగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బిల్డర్ల నుంచి ఓ అధికారికి భారీగా ముడుపులు ముట్టినట్లు తెలిసింది. విచారణ ముందుకెళ్లకుండా... నివేదిక అందకుండా చేసేందుకు తీవ్రప్రయత్నాలు చేసినట్లు సమాచారం. మరి విచారణ అటకెక్కిస్తారా...? అక్రమాల నిగ్గు తేలుస్తారా...? అనేది తేలాల్సి ఉంది.


Updated Date - 2021-07-24T06:01:59+05:30 IST