యూరప్ భద్రతకు రష్యా ముప్పు...బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-03-04T16:52:19+05:30 IST

బ్రిటన్ దేశ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్ రష్యా చర్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు....

యూరప్ భద్రతకు రష్యా ముప్పు...బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యలు

లండన్ :బ్రిటన్ దేశ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్ రష్యా చర్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ దేశంపై రష్యా చేస్తున్న దాడులు యూరప్ భద్రతకు ముప్పుగా మారిందని బ్రిటన్ దేశ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకుంటున్న చర్యలు యూరప్ దేశాల మొత్తానికి అపాయం కలిగిస్తున్నాడని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఉక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడి చేసిన తర్వాత జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అతిపెద్ద అణు విద్యుత్ కేందంపై రష్యా దాడి నేపథ్యంలో రాబోయే మరికొద్ది గంటల్లో ఐక్యరాజ్యసమితి అత్యవసర భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని  కోరతామని బోరిస్ జాన్సన్ వివరించారు.


Updated Date - 2022-03-04T16:52:19+05:30 IST