రష్యా అణ్వస్త్రాల్ని సిద్ధం చేసిందా?

ABN , First Publish Date - 2022-03-20T16:53:40+05:30 IST

ఉక్రెయిన్‌పై ఇప్పటికే దాడిని తీవ్రం చేసిన పుతిన్, అవసరమైతే అణ్వస్త్రాలు కూడా ప్రయోగించేందుకు సిద్ధమయ్యారా? పాశ్చాత్య దేశాల అంచనా ప్రకారం అవుననే అనిపిస్తోంది

రష్యా అణ్వస్త్రాల్ని సిద్ధం చేసిందా?

ఉక్రెయిన్‌పై ఇప్పటికే దాడిని తీవ్రం చేసిన పుతిన్, అవసరమైతే అణ్వస్త్రాలు కూడా ప్రయోగించేందుకు సిద్ధమయ్యారా? పాశ్చాత్య దేశాల అంచనా ప్రకారం అవుననే అనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి ఎంతకూ ముగియకపోవడం, అమెరికాసహా ఇతర దేశాల ఆంక్షల మధ్య అవసరమైతే అణ్వస్త్రాల ప్రయోగానికి సిద్దపడ్డట్లు సమాచారం. దీనికోసం అణ్వస్త్రాల్ని తరలించే డ్రిల్ నిర్వహించమని సైన్యాన్ని పుతిన్ ఆదేశించాడు. అయితే, ఈ నిర్ణయం రష్యా అధికారుల్ని షాక్‌కు గురిచేసింది. రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కీలక సైన్యాధికారి డిమిట్రీ మెద్వెదేవ్, పార్లమెంట్ ఉభయ సభల స్పీకర్స్ వ్యాచెల్సావ్, వాలెంటినాలకు అణు యుద్ధం గురించి పుతిన్ సమాచారం ఇచ్చాడు.

పుతిన్ కుటుంబ సభ్యులెక్కడ?

యుధ్దం మొదలైనప్పటినుంచి చాలామందిని వేధిస్తున్న ప్రశ్న.. పుతిన్ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారని. నిజానికి పుతిన్ కుటుంబ సభ్యుల గురించి బయటి ప్రపంచానికి అంతగా తెలియదు. ఎక్కువగా తన కుటుంబాన్ని పుతిన్ రహస్యంగానే ఉంచుతాడు. తాజాగా యుద్ధం నేపథ్యంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు. సైబీరియాలోని తెహ్ అల్తాహ్ పర్వాత ప్రాంతంలోకి పుతిన్ కుటుంబ సభ్యుల్ని తరలించాడు. అక్కడ పూర్తిగా భూగర్భంలో నిర్మించిన ఒక హైటెక్ బంకర్‌లో, అత్యంత భద్రత మధ్య తన ఫ్యామిలీని ఉంచినట్లు సమాచారం.


డూమ్స్ డే ప్లాన్

ప్రపంచం అంతమయ్యే రోజును డూమ్స్ డే అంటారు. అంటే అణు యుద్ధమే సంభవిస్తే కచ్చితంగా అది ప్రపంచ వినాశనానికే దారితీస్తుంది. ఒకవేళ అణుయుద్ధం (డూమ్స్ డే) సంభవిస్తే దాన్నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయంలో కూడా పుతిన్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఇందుకోసం రష్యా డూమ్స్ డే ప్లేన్స్ సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే అణ్వస్త్రాల ప్రయోగానికి చిక్కకుండా ఉండే విమానాలు. వీటిని వాడాలని పుతిన్ భావించాడు. అలాగే ఒక స్కై బంకర్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. కానీ, ఇది ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. వీటివల్ల అణ్వస్త్ర ప్రయోగాల నుంచి తప్పించుకునే వీలుంది.

పుతిన్ ఒంటరివాడయ్యాడా?

నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ ఒంటరివాడయ్యాడు. అన్ని అంశాల్లోనూ సొంతంగా విశ్లేషించుకుని, నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పుతిన్‌కు సలహాలిచ్చేవాళ్లు కూడా లేరు. దీంతో అన్ని పరిస్థితులను అంచనా వేయడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారింది.

Updated Date - 2022-03-20T16:53:40+05:30 IST