మా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి

ABN , First Publish Date - 2021-04-16T06:04:33+05:30 IST

మండలంలోని అబ్బాపూర్‌ గ్రామానికి చెందిన అశ్విత- మహేష్‌ దంపతుల నాలు గు నెలల పసికందు గుండె సంబంధిత వ్యాధితో బాధప డుతుండగా తమ బిడ్డను ఆదుకోవాలంటూ వారు ఆపన్నహస్తం కోసం ఎదరు చూస్తున్నారు.

మా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి
చిన్నారితో తల్లిదండ్రులు

  గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి

 శఽస్త్ర చికిత్సకు రూ.5 లక్షల వరకు ఖర్చు

  ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల వేడుకోలు

గొల్లపల్లి, ఏప్రిల్‌ 15: మండలంలోని అబ్బాపూర్‌ గ్రామానికి చెందిన అశ్విత- మహేష్‌ దంపతుల నాలు గు నెలల పసికందు గుండె సంబంధిత వ్యాధితో బాధప డుతుండగా తమ బిడ్డను ఆదుకోవాలంటూ వారు ఆపన్నహస్తం కోసం ఎదరు చూస్తున్నారు. చికిత్సకు రూ. 5లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో రెక్కాడితే కాని డొక్కాడని ఆ దంపతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గ్రామానికి చెందిన అశ్విత-మహేష్‌ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. శ్రీహాన్‌ (04), మరో నాలుగు నెలల బాబు ఉన్నారు. శ్రీహాన్‌కు ఇప్పటికీ మాటలు రాకపోవడంతో తల్లిదండ్రులు అప్పు చేసి అసుపత్రుల వెంట తిరిగినా ఫలితం లేకుండా పోయింది. నాలుగు నెలల క్రితం పుట్టిన బాబుకు గుండెలోని మంచి, చెడు రక్తకణాలు పని చేయక పోవడంతో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ అసుపత్రిలో చిన్నారిని పరీక్షించిన వైద్యులు గుండెకు వెంటనే  శస్త్రచికిత్స చేయించాలని, లేకుంటే  బాబు ప్రాణాలకే ముప్పు అనిచెప్పారు. అందుకు మొత్తం దాదాపు రూ. 5లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదిరిచూస్తున్నారు. క్షవరం వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిం చుకునే తండ్రి మహేష్‌ పొట్టగ డవడమే కష్టం అవుతుండటంతో తన కొడుకును బతికించుకునే మార్గం కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.  

Updated Date - 2021-04-16T06:04:33+05:30 IST