Jun 18 2021 @ 01:46AM

చేతిలో చెయ్యేసి అడుగులో అడుగేసి...

చేతిలో చెయ్యేసి అడుగులో అడుగేసి జంటగా కలసి వెళ్తున్నారు నయనతార, విఘ్నేశ్‌ శివన్‌. నయనతారకు కొంచెం కూడా అసౌకర్యం కలగకుండా ‘నేనున్నాను’ అంటూ రక్షణగా వెంటపెట్టుకొని వెళ్తున్నాడు విఘ్నేశ్‌. ఈ లవర్స్‌ ఇద్దరూ కొచ్చి ఎయిర్‌పోర్టులో విమానం దిగి వెళ్తున్న దృశ్యాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరలయ్యాయి. 

నయనతార తల్లితండ్రులను కలిసేందుకు వీరిద్దరూ ప్రైవేట్‌ ఫ్టైట్‌లో వెళ్లారు. ప్రస్తుతం నయనతార ‘నెట్రికన్‌’, ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.