Abn logo
Mar 8 2021 @ 14:25PM

నిర్మాత పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావుకు మాతృవియోగం

నిర్మాత, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మ‌న్‌, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు మాతృమూర్తి పుస్కూర్ కమలాదేవి (93) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం మంచిర్యాలలో తుదిశ్వాస విడిచారు. ప్ర‌స్తుతం పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు ‘లక్ష్య’, ‘లవ్ స్టోరి’ వంటి చిత్రాలతో పాటు.. ఇటీవల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా ప్రారంభమైన చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement