Jun 16 2021 @ 19:03PM

సమంత చేతుల మీదుగా...!

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘పుష్పక విమానం’ చిత్రంలోని మరో లిరికల్‌ సాంగ్‌ను హీరోయిన్‌ సమంత చేతుల మీదుగా విడుదల కానుంది. దామోదర దర్శకత్వంలో గోవర్థన్‌ రావు దేవరకొండ, విజయ్‌ దషి , ప్రదీప్‌ ఎర్రబెల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ప్రమోషన్‌లో భాగంగా ‘కళ్యాణం’ లిరికల్‌ సాంగ్‌ను ఈ నెల 18న ఉదయం 11 గంటలకు సమంత విడుదల చేయనున్నారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌, మంగ్లీ ఆలపించారు. రామ్‌ మిరియాల సంగీతం అందించారు.