గజవాహనంపై చెన్నకేశవుడు

ABN , First Publish Date - 2021-05-12T05:06:33+05:30 IST

పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజున కామాక్షి సమేత వైద్యనాధేశ్వర, లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు చెన్నకేశవస్వామి గజవాహనంపై, వైద్యనాధేశ్వరుడు సింహవాహనంపై కొలువుదీరారు.

గజవాహనంపై చెన్నకేశవుడు
గజవాహనంపై చెన్నకేశవుడు

వల్లూరు, మే 11 : పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజున కామాక్షి సమేత వైద్యనాధేశ్వర, లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు చెన్నకేశవస్వామి గజవాహనంపై, వైద్యనాధేశ్వరుడు సింహవాహనంపై కొలువుదీరారు. అంతకు ముందు మంగళవారం తెల్లవారుజామున ముందుగా యాగశాలలో ప్రాతఃకాల ఆరాధన చేశారు. అనంతరం గణపతిపూజను నిర్వహించారు. యాగశాల పూజలు చేసి నవగ్రహ లక్ష్మీ చెన్నకేశవ వైద్యనాధేశ్వర రుద్ర పాశుపత హోమాలను విశేషద్రవ్యాలతో హోమాలు చేశారు. చతుర్వేద షష్టితో కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించారు. నేడు స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ అభిషేకంలో ముఖ్యంగా వివిధ ద్రవ్యాలను 108 కలశాలతో ఆహ్వానించి విశేష ద్రవ్యాలు అందులో పోసి స్వామివారికి అభిషేకం ఉంటుందన్నారు.

Updated Date - 2021-05-12T05:06:33+05:30 IST