Oct 13 2021 @ 12:05PM

'పుష్ప': శ్రీవల్లి లిరికల్ సాంగ్ రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'. తాజాగా ఈ సినిమా నుంచి శ్రీవల్లి అనే లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మొదటి భాగం 'పుష్ప ది రైస్' డిసెంబర్ 17న 5 భాషలలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టు ఆల్రెడీ మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ 'పుష్ప రాజ్', రష్మికల 'శ్రీవల్లి' లుక్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో వచ్చిన 'దాక్కో దాక్కో మేక' సాంగ్ సినిమాపై బాగానే అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో ఇప్పుడు 'చూపె బంగారమాయేనే శ్రీవల్లి'.. అంటూ సాగే లిరికల్ సాగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ పాడగా, రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.