అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ మంగళవారం సికింద్రాబాద్‌లో పున:ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో తెలిపింది. ‘పుష్ప’ రెండు భాగాలుగా రూపొందుతోంది. 45 రోజుల పాటు జరిగే చిత్రీకరణతో సినిమా మొదటి భాగం పూర్తవనుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే పాత్రలో ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నారు. రష్మిక మందన్న కథానాయిక. ఫాహద్ ఫాజిల్ విలన్‌పాత్రలో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. దే వి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.