Jul 6 2021 @ 12:59PM

'పుష్ప' షూటింగ్‌ షురూ

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప'. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంతో సినిమా షూటింగ్‌ను ఆపారు. ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడటంతో పాటు అందరూ స్టార్స్‌ సినిమాల షూటింగ్స్‌ను స్టార్ట్‌ చేస్తుండటంతో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ 'పుష్ప' షూటింగ్‌ను మంగళవారం షురూ చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరో 40 రోజులు చిత్రీకరణ చేస్తే... తొలి భాగం పూర్తవుతుంది. ఈ నెలలో అల్లు అర్జున్‌ సహా ప్రధాన తారాగణంగాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఆగస్టుకు బ్యాలెన్స్‌ వర్క్‌ పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఇందులో అల్లు అర్జున్‌, రష్మికపై కీలక సన్నివేశాలతో ఓ పాటను తెరకెక్కించనున్నారని టాక్‌. మలయాళ స్టార్‌ హీరో ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. 'ఆర్య, ఆర్య2' చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది.