Advertisement

Pushpa: ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియన్ స్టార్..?

'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాబోతున్నాడా..! ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా పాన్ ఇండియన్ రేంజ్‌లో రూపొందుతున్న సినిమా 'పుష్ప'. 5 భాషలలో ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకులముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం డిసెంబరు 6న థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌కు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ కూడా త్వరలోనే మేకర్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. సమంత ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఇక ఈ సినిమా రెండు భగాలుగా రూపొందుతోంది.

Advertisement
Advertisement