Abn logo
Jul 8 2020 @ 03:00AM

ట్యూన్స్‌ రెడీ!

సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా అనగానే యువత నుంచి పెద్దవారి వరకూ ఆసక్తిగా ఎదురుచూస్తారు.  ఆయన కథకు ఎంత ప్రాధాన్యమిస్తారో, సంగీతానికీ అంతే ప్రాధాన్యమిస్తారు. అందుకే ఆయన చిత్రాల్లో పాటలు అంతగా ఆదరణ పొందుతాయి. సుకుమార్‌కు, దేవిశ్రీ ప్రసాద్‌ తోడైతే సంగీత ప్రియులకు పండగనే చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ ‘పుష్ప’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ సెట్‌లో అడుగుపెట్టడానికి ఎవరూ ధైర్యం చేయడం లేదు. ‘పుష్ప’ టీమ్‌ కూడా ఇంకా సెట్లో అడుగుపెట్టలేదు. అయితే లాక్‌డౌన్‌ సమయాన్ని సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌ చక్కగా ఉపయోగించుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అప్లికేషన్స్‌ ద్వారా వర్చువల్‌ మ్యూజిక్‌ సెషన్లు నిర్వహించి ట్యూన్స్‌ ఎంపిక పూర్తి చేశారని సమాచారం. ఇందులో 5 పాటలు ఉంటాయని, రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలయ్యే లోపు పాటల రికార్డింగ్‌ కూడా పూర్తవుతుందని చిత్రవర్గాల నుంచి తెలిసింది. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement