Advertisement

Pushpa the rise : ట్రైలర్ వచ్చేది అప్పుడే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప : ది రైజ్’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ థ్రిల్లర్. రష్మికా మందణ్ణ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.అలాగే సునీల్ కూడా విలన్ గా సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. డిసెంబర్ 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 6న విడుదల చేస్తున్నారు. అయితే ఏ టైమ్ లో వస్తుంది అన్న విషయాన్ని మెన్షన్ చేయలేదు. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.


పుష్పరాజ్ గా నెవర్ బిఫోర్ అవతార్ లో బన్నీ అభిమానుల్ని అలరించబోతున్న ఈ సినిమాకి రెండో భాగం కూడా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. మొదటి భాగం విడుదలైన వెంటనే రెండో భాగం షూటింగ్ మొదలు కాబోతోంది. మరి పుష్ప సినిమాతో బన్నీ ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటారో చూడాలి.   


Advertisement