Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 24 Mar 2022 19:50:11 IST

‘పుష్పరాజ్’ ఖాతాలో మరో రికార్డ్!

twitter-iconwatsapp-iconfb-icon

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్పరాజ్’గా నటించిన ‘పుష్ప’ చిత్రం మరో రికార్డుని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో తెలియంది కాదు. ఇప్పటికీ ‘పుష్ప’ క్రేజ్ తగ్గలేదు అనేదానికి నిదర్శనం తాజాగా ఈ చిత్రానికి బుల్లితెరపై వచ్చిన టీవీఆరే. మార్చి 13న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మా ఛానల్‌లో ఈ చిత్రం ప్రసారమైంది. పోటీగా ఇతర ఛానళ్లలో స్టార్ హీరోల సినిమాలు ప్రసారమైనప్పటికీ.. ‘పుష్ప’ 81శాతం షేర్‌తో 25.2 టీవీఆర్‌ని సాధించినట్లుగా స్టార్ మా అధికారికంగా తెలియజేసింది. ఈ రేటింగ్‌తో బుల్లితెర ఆల్ టైమ్ టాప్ 5 స్థానాలలో ‘పుష్ప’ కూడా చేరి రికార్డు క్రియేట్ చేసింది. మొట్టమొదటి స్థానంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో..’ చిత్రమే ఉండటం విశేషం.


క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రం అంతర్జాతీయ గుర్తింపుని సొంతం చేసుకుంది. పలువురు క్రికెటర్లు ‘పుష్ప’ మ్యానరిజమ్స్‌ని అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రదర్శించారు. కోహ్లి, జడేజా వంటి క్రికెటర్లే కాకుండా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కూడా ‘పుష్ప’ మ్యానరిజమ్‌ని ఇమిటేట్ చేశారు. అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‌లో కనిపించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన పార్ట్ 2 చిత్రీకరణను త్వరలోనే ప్రారంభించనున్నారు. ప్రస్తుతం లొకేషన్ వేటలో యూనిట్ ఉన్నట్లుగా సమాచారం.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement