Jul 9 2021 @ 23:11PM

నెలాఖరువరకూ హైదరాబాద్‌లోనే!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ‘పుష్ప’ తొలి భాగం చిత్రీకరణ ఇటీవల పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెలఖరు వరకూ హైదరాబాద్‌లోనే తొలి భాగానికి అవసరమైన కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత ఆగస్టులో చిత్రబృందం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనుంది. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లిలో పదిహేను రోజుల పాటు ఓ షెడ్యూల్‌ చేయనున్నారు. దాంతో ‘పుష్ప-1’ పూర్తవుతుంది.


ఆగస్టు నెలాఖరుకు తొలి భాగానికి గుమ్మడికాయ కొట్టాలని ధృడ సంకల్పంతో చిత్రీకరణ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న, వచ్చే నెలలో జరగబోయే షెడ్యూళ్లల్లో రెండు పాటలను కూడా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు.