మైదానంలోనూ ‘తగ్గేదేలే’

ABN , First Publish Date - 2022-01-25T08:47:58+05:30 IST

పుష్ప’ సినిమా మేనియా భారత్‌లోనే కాదు..విదేశాల్లోనూ కుదిపేస్తోంది.

మైదానంలోనూ  ‘తగ్గేదేలే’

క్రికెట్‌ను తాకిన ‘పుష్ప’ మేనియా


న్యూఢిల్లీ: ‘పుష్ప’ సినిమా మేనియా భారత్‌లోనే కాదు..విదేశాల్లోనూ కుదిపేస్తోంది. సోషల్‌ మీడియాలో పుష్ప సినిమా డైలాగ్‌లు, అర్జున్‌ హావభావాలతో అనుకరణ వీడియోలు రచ్చరచ్చ చేస్తున్నాయి. ఢాకాలో జరుగుతున్న బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఫార్చ్యూన్‌ బరిషాల్‌తో మ్యాచ్‌లో సిల్హెట్‌ సన్‌రైజర్స్‌ బౌలర్‌ నజ్ముల్‌ ఇస్లాం.. వికెట్‌ తీసిన తర్వాత పుష్ప సిగ్నేచర్‌ స్టైల్‌ ‘తగ్గేదేలే’ అన్నట్టుగా గడ్డం కింద చేతిని రుద్దుకుంటూ సంబరాలు చేసుకున్నాడు. ఇక టీమిండియా క్రికెటర్‌ జడేజా, ఆస్ట్రేలియా ఆటగాడు వార్నర్‌ కూడా పుష్ప ఫేమస్‌ డైలాగ్‌ ‘తగ్గేదేలే’ అంటూ హల్‌చల్‌ చేశారు. తాజాగా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా.. ‘శ్రీవల్లి’ పాటకు బన్నీని అనుకరిస్తూ స్టెప్పులేశాడు. ‘నన్నునేను నియంత్రించుకోలేక.. ఈ సెప్ట్‌కు ప్రయత్నించా. అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా చూశా. బ్రదర్‌.. నీ నటన అద్భుతం’ అని రైనా ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. 

Updated Date - 2022-01-25T08:47:58+05:30 IST