Pushpa: ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగబోతున్న బన్నీ..!

ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ హీరోలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల కోసం స్వయంగా అభిమానుల మధ్యలోకి రాబోతున్నాడట. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' రూపొందుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. స్టార్ హీరోయిన్ సమంత ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తం శెట్టి మీడియా కలిసి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. డిసెంబర్ 17న 'పుష్ప ది రైజ్ పార్ట్ 1' భారీ స్థాయిలో ప్రేక్షకులముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను ప్రారంభించబోతున్నారట. ఇదే క్రమంలో అల్లు అర్జున్ కూడా స్వయంగా 'పుష్ప' సినిమా ప్రమోషన్స్‌కు హాజరై అభిమానల్లో అంచనాలను పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాడట. నానీ కూడా తను నటించిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమా ప్రమోషన్స్ కోసం స్వయంగా కొన్ని ప్రాంతాలలో సందడి చేయనున్నాడు. ఇప్పుడు బన్నీ కూడా ఇందుకుసిద్దమవుతున్నాడట. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.  

Advertisement