Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 01 Jul 2022 18:38:04 IST

Pushpa 2: చిత్తూరు యాస వస్తే ఛాన్స్ మీకే..

twitter-iconwatsapp-iconfb-icon

మీకు చిత్తూరు యాస వచ్చా..అందులో చక్కగా మాట్లాడగలరా..అయితే పాన్ ఇండియన్ సినిమా పుష్ప 2 (Pushpa 2)లో నటించే అవకాశం అందుకోవచ్చు. తాజాగా మేకర్స్ దీనికి సంబంధించిన ప్రకటనను ఇచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రూపొంది పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ సాధించిన పుష్ప: ది రైజ్ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప: రూల్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ రష్మికా మందన్నా (Rashmika Mandanna) అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటించబోతుంది.

సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. మొదటి భాగంలో కనిపించిన సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ ఈ కొనసాగింపులోనూ నటిస్తున్నారు. అంతేకాదు, ఈ మధ్య విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay sethupathi) కూడా కీలక పాత్రకు ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పిస్తూ అన్ని ఏజ్ గ్రూపుల వారికి ఆహ్వానం పలికారు. 

ముఖ్యంగా చిత్తూరు యాస రావాలని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన పోస్టర్‌లో పేర్కొన్నారు. ఇక ఈ ఆడిషన్స్ తిరుపతిలో జరగనున్నాయి. మేక్ మై బేబీ జీనియస్ స్కూల్, న్యూ బాలాజీ కాలనిలో ఈ ఆడిషన్ జూలై 3,4, 5 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. మరి పుష్ప 2లో నటించే అవకాశం ఎవర్ని వరిస్తుందో చూడాలి. కాగా, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగితం అందిస్తున్నారు. మొదటి భాగంలో సమంత 'ఊ అంటావా మావా' అంటూ మాస్ సాంగ్‌లో నర్తించి ఊపేసింది. అలాంటి సాంగ్ సీక్వెల్‌లోనూ ఉంటుందట. ఈ సాంగ్ చేసే అవకాశం ఏ స్టార్ హీరోయిన్‌కి దక్కుతుందో.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement