టమాటా రైతు కోసం బటన్‌ నొక్కాలి

ABN , First Publish Date - 2022-08-07T08:01:53+05:30 IST

టమాటా రైతు కోసం బటన్‌ నొక్కాలి

టమాటా రైతు కోసం బటన్‌ నొక్కాలి

మాధవ్‌ బట్టలు విప్పి.. సీఎం వెంట్రుక పీకేశారు: దేవినేని ఉమా

అనంతపురం అర్బన్‌, ఆగస్టు 6: అనంతపురం జిల్లా టమాటా రైతుల కళ్ల లో రక్తం వస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు శనివారం సాయంత్రం బెంగళూరు నుంచి అనంతపురానికి వస్తున్న ఆయన, అనంతపురం నగర శివారులో హైవే పక్కన రైతులు పారబోసిన టమాటాల ను చూసి చలించిపోయారు. వాహనాన్ని ఆపి, వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘నా వెంట్రుక ఎవరూ పీకలేరని సీఎం జగన్‌ అన్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ బట్టలు విప్పేసి, సీఎం వెం ట్రుకను పీకేశాడు’ అని విమర్శించారు. టమాటా పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు బటన్‌ నొక్కాలని సీఎంను డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-08-07T08:01:53+05:30 IST