భక్తులతో పోటెత్తిన ‘పూసాయి ఎల్లమ్మ’

ABN , First Publish Date - 2021-01-25T06:27:54+05:30 IST

మండలంలోని పూసాయి గ్రామంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ జాతర రెండో రోజు ఆదివారం భక్తులతో పోటెత్తింది. జిల్లా నలుమూలలతోపాటు, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

భక్తులతో పోటెత్తిన ‘పూసాయి ఎల్లమ్మ’
అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్న భక్తులు

జైనథ్‌, జనవరి 24: మండలంలోని పూసాయి గ్రామంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ జాతర రెండో రోజు ఆదివారం భక్తులతో పోటెత్తింది. జిల్లా నలుమూలలతోపాటు, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మేకలు, కోళ్లను అమ్మవారికి బలిచ్చి ప్రజలను పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. చర్మ, దీర్ఘకాలిక వ్యాధులు నయం కావాలని స్థానిక కోనేరులో భక్తులు స్నానమాడారు. భక్తుల రద్దీ అధికం కావడంతో పూసాయి జాతర జన సంద్రంగా మారింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సై సాయిరెడ్డి వెంకన్న భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. 

ఘనంగా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం..

తలమడుగు : మండలంలోని పల్లి(బి) గ్రామంలో ఆదివారం ఘనంగా రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ పొలిమేరలో గల ఎల్లమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం జనవరిలో ఆలయ వార్షికో త్సవం నిర్వహించడం జరుగుతుందని గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులతో పాటు మండల వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయంలో దూపదీప నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో జడ్పీటీసీ గణేష్‌ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మి, సర్పంచ్‌, ఎంపీటీసీ యశోద, ఆలయఅభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T06:27:54+05:30 IST