ఊదా రంగు ఊరు!

ABN , First Publish Date - 2020-07-22T05:30:00+05:30 IST

అదొక చిన్న దీవి. అందులో అడుగుపెడితే అంతటా ఊదా రంగే కనిపిస్తుంది. ఇళ్లు, వంతెనలు, పార్కులు... ఒక్కటేమిటి...

ఊదా రంగు ఊరు!

అదొక చిన్న దీవి. అందులో అడుగుపెడితే అంతటా ఊదా రంగే కనిపిస్తుంది. ఇళ్లు, వంతెనలు, పార్కులు... ఒక్కటేమిటి... 


ఆ ఊళ్ళో ఏది చూసినా ఊదా(పర్పుల్‌) రంగులోనే కనిపిస్తాయి. కరోనా వైరస్‌ లేకుంటే కనుక ఈ సమయంలో పర్యాటకులతో ఆ ఊరు కిటకిటలాడేది. దక్షిణ కొరియాలోని పర్పుల్‌ ఐలాండ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతోంది. దక్షిణ కొరియాలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో పర్పుల్‌ ఐలాండ్‌ కూడా చేరింది. విస్తారమైన లావెండర్‌ తోటలు కనువిందు చేస్తాయి. ఇక్కడ రోడ్లు కూడా ఊదా రంగులోనే ఉండడం విశేషం. ఈ ఊరిలో అడుగుపెడితే పర్పుల్‌ వరల్డ్‌లోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది.


Updated Date - 2020-07-22T05:30:00+05:30 IST