పూరి (ఒడిశా): కరోనా వల్ల గత 4 నెలలుగా మూతబడిన పూరి జగన్నాథ్ దేవాలయం ఎట్టకేలకు పునర్ ప్రారంభమైంది. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం భక్తులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పూరి జగన్నాథుని దర్శనం చేసుకున్నారు. కొవిడ్ రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు, లేదా ఆర్టీపీసీఆర్ రిపోర్టు నెగిటివ్ ఉన్న భక్తులు తమ ఐడెంటిటీకార్డుతో చూసి జగన్నాథ్ ఆలయ దర్శనానికి అనుమతిస్తున్నామని ఆలయ ప్రధానాధికారి కృష్ణన్ కుమార్ చెప్పారు. పండుగల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆలయాన్ని ఆ రోజుల్లో మూసివేయాలని నిర్ణయించామని ఆలయ అధికారులు చెప్పారు. 4నెలల తర్వాత ఆలయం తెరవడంతో పూరి జగన్నాథుని ఆలయ దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు.