Abn logo
Mar 25 2020 @ 17:40PM

పూరీతో మరోసారి మహేశ్‌బాబు?

దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో హ్యాట్రిక్ కొట్టేందుకు సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరోసారి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాయి.  ఆ తర్వాత మళ్లీ సినిమా రాలేదు. ‘బిజినెస్‌మేన్’ చిత్రం తర్వాత పూరీ- మహేశ్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని ప్రచారం జరిగింది.  అందువల్లే వీరి కాంబినేషన్‌లో ఇప్పటి‌వరకూ మరో చిత్రం రాలేదని కొందరు టాలీవుడ్ ప్రముఖులు బహిరంగానే కామెంట్స్ చేశారు. అయితే అవేవి నిజం కాదనేందుకు ఓ సినిమాను సెట్ చేయాలని పూరీ జగన్నాథ్ భావిస్తున్నారట. సుమారు 8 ఏళ్ల తర్వాత మహేశ్‌బాబు కోసం కథ రెడీ చేశారట. మహేశ్ ఓకే అంటే కథ వినిపించేందుకు రెడీగా ఉన్నారట. అయితే మహేశ్ బాబు వరుస కమిట్మెంట్‌లతో సినిమాలు చేస్తున్నారు. వంశీపైడిపల్లి, పరుశురాం డైరెక్ట్ చేస్తున్న సినిమాల్లో నటించనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత పూరీతో సినిమా చేసేందుకు మహేశ్ బాబు మొగ్గు చూపుతున్నారట. ఇప్పటికివరకూ అయితే అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. 


Advertisement
Advertisement
Advertisement