ఎస్వీబీసీని ప్రక్షాళన చేయండి

ABN , First Publish Date - 2020-11-25T05:35:19+05:30 IST

ఎస్వీబీసీని ప్రక్షాళన చేయాలని సీఎం జగన్మోహన్‌ రెడ్డి టీటీడీ ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఎస్వీబీసీని ప్రక్షాళన చేయండి

సీఎం జగన్‌ ఆదేశం

బీజేపీ నేతల లేఖ నేపథ్యంలో  పోర్న్‌ లింక్‌పై వాకబు  


తిరుపతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇటీవల తరచూ వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్న ఎస్వీబీసీని ప్రక్షాళన చేయాలని సీఎం జగన్మోహన్‌ రెడ్డి టీటీడీ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎస్వీబీసీలో నెలకొంటున్న వివాదాల నేపథ్యంలో దీనిని ప్రక్షాళన చేయాలని బీజేపీ నేతలు గతంలో రాసిన లేఖపై మంగళవారం సీఎం స్పందించారు. ఓ భక్తుడికి పోర్న్‌ లింక్‌ పంపిన వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు గురించి టీటీడీ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక ప్రచారానికి కేంద్రంగా ఉండాల్సిన ఎస్వీబీసీలో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. 

Updated Date - 2020-11-25T05:35:19+05:30 IST