సెంట్రల్ విస్టాపై కాంగ్రెస్ డబుల్ గేమ్: కేంద్ర మంత్రి విమర్శలు

ABN , First Publish Date - 2021-05-08T02:29:25+05:30 IST

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ వింత ధోరణి అవలంబిస్తోంది. ఇది మా ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ప్రాజెక్ట్ కదు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కొత్త పార్లమెంట్‌ ఆలోచనలు వచ్చాయి. చాలా సంవత్సరాల క్రితమే సెంట్రల్ విస్టా ఖర్చును 20,000 కోట్ల రూపాయలుగా

సెంట్రల్ విస్టాపై కాంగ్రెస్ డబుల్ గేమ్: కేంద్ర మంత్రి విమర్శలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న సెంట్రల్ విస్టాపై కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతోందని కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి విమర్శించారు. ఈ ప్రాజెక్ట్‌ కొత్త ఆలోచన కాదని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నూతన పార్లమెంట్ భవన ఆవశ్యకతపై ఆలోచనలు వచ్చాయని అన్నారు. కోవిడ్ లాంటి మహమ్మారిని వదిలేసి ప్రభుత్వం సెంట్రల్ విస్టాకు భారీ మొత్తంలో ఖర్చు పెడుతోందని వస్తున్న విమర్శలను ఆయన కొట్టాపారేశారు. దేశ బడ్జెట్‌లో మూడు లక్షల కోట్ల రూపాయలు ఆరోగ్యం కోసం కేటాయించామని, తమ ప్రాధాన్యాలు తమకు ఉన్నాయని హర్‌దీప్ సింగ్ సమాధానం చెప్పారు.


ఈ విషయమై ఆయన శుక్రవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ వింత ధోరణి అవలంబిస్తోంది. ఇది మా ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ప్రాజెక్ట్ కదు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కొత్త పార్లమెంట్‌ ఆలోచనలు వచ్చాయి. చాలా సంవత్సరాల క్రితమే సెంట్రల్ విస్టా ఖర్చును 20,000 కోట్ల రూపాయలుగా నిర్ధారించారు. ఇది దేశంలోని కోవిడ్‌కు ఎలాంటి ఊతం ఇవ్వదు. ఈ ఏడాది ఆరోగ్య సంరక్షణ కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు నిధుల్ని బడ్జెట్‌లో కేటాయించాం. దేశ ప్రాధాన్యాలు ఏంటో మాకు తెలుసు’’ అని తన ట్వీట్ చేశారు.

Updated Date - 2021-05-08T02:29:25+05:30 IST