May 12 2021 @ 14:29PM

'లైగర్‌'కు పూరి సెంటిమెంట్..!

విజయ్ దేవరకొండ - బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా 'లైగర్'. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చే ప్రతీ సినిమాలో బీచ్ సాంగ్ తప్పకుండా ఉంటుంది. ఇది పూరికి సెంటిమెంట్ అని కొందరు అంటుంటారు. బీచ్ సాంగ్‌ను హీరో హీరోయిన్స్ మీద రొమాంటిక్‌గా పిక్చరైజ్ చేయడంలో పూరి స్టైలే వేరు. సినిమాకి బాగా హైలెట్ అయ్యేలా తెరకెక్కించి ఆకట్టుకుంటుంటాడు. 'ఇడియట్', 'పోకిరి, 'చిరుత' 'బిజినెస్ మాన్', 'గోలీమార్', 'సూపర్' సహా పూరి గత చిత్రం 'ఇస్మార్ట్ శంకర్‌'లోనూ బీచ్ సాంగ్స్ యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇప్పుడు రూపొందుతున్న 'లైగర్' సినిమాలోనూ విజయ్ దేవరకొండ - అనన్య పాండేల మీద బీచ్ సాంగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక మారిషస్ లేదా మాల్దీవుల్లో ఈ సాంగ్ షూట్ చేయనున్నట్టు సమాచారం. ధర్మ ప్రొడక్షన్స్ - పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.