Abn logo
Oct 11 2020 @ 14:01PM

పాజిటివ్‌ మాట్లాడలేకపోతే నోరు మూసుకుందాం: పూరీ జగన్నాథ్‌

'మీరు మాట్లాడిన, ట్వీట్‌ చేసిన పాజిటివ్‌ అయితేనే చేయండి, భవిష్యత్తులో బాధపడే ఏపనీ చేయద్దు' అని అంటున్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌ భాగంగా టంగ్‌(నాలుక) గురించి పూరీ జగన్నాథ్‌ మాట్లాడారు. "మనం బాగా కష్టపడుతుంటాం. చదువుకుని ఉంటాం, బెస్ట్‌ సర్కిల్‌ ఉంటుంది. అయినా ఎక్కడో మన కెరీర్ ఎఫెక్ట్‌ అవుతుంటుంది. ఒకే ఒక కంప్లైంట్‌, రోజూ లొడలొడ వాగే మన నాలుక మన కెరీర్‌ను పాడుచేస్తుంటుంది. అది తెలుసుకునేలోపు మనల్ని పోస్ట్‌మార్టం చేసి పంచనామా రాసేస్తారు. మనం ఏమాట్లాడుతున్నామో కాన్‌సన్‌ట్రేషన్‌ చేయాలి. అవతల వాడ్ని హర్ట్‌ చేసి విషయాన్ని మాట్లాడొద్దు. మనం మాట్లాడేది పాజిటివ్‌ కాకపోతే అసలు నోరు విప్పొద్దు. రెండు పెగ్‌లేసిన తర్వాత మనం ఒకటి మాట్లాడితే లోపలకెళ్లిన మందు ఇంకోటి మాట్లాడుతుంది. దాంతో ఉన్న రిలేషన్స్‌ అన్నీ దొబ్బుతాయి. తాగితే స్పృహలో ఉండాలి. స్పృహ తప్పేలా మాత్రం తాగొద్దు. ఏమీ మాట్లాడకుండా తాగి పడిపోయినా నెమ్మదిగా సోసైటీలో మన క్రెడిబిలిటీ పోతుంటుంది. అది మనకు తెలియదు. పాజిటివ్‌గా ఏం చెప్పాలో తెలియనప్పుడు నోరు మూసుకుందాం. ఎవరైనా హర్ట్‌ అయితే సారీ చెప్పేద్దాం" అన్నారు  పూరీ జగన్నాథ్‌. Advertisement
Advertisement
Advertisement