'నీకేంట్రా నువ్వింకా చిన్నపిల్లడివని అంటే నమ్మొద్దు' అని అంటున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా 'వన్ మూమెంట్' గురించి మాట్లాడుతూ "బుద్ధుడు చెప్పాడు ఓ క్షణం ఓ రోజునే మార్చేస్తుంది. ఓరోజు జీవితాన్నే మార్చేస్తుంది. ఓ జీవితం ప్రపంచాన్నే మార్చేస్తుందని. బుక్‌లో ఓ పేజీ కావచ్చు. మీరు చదివిన ఓ కోడ్ కావచ్చు. ఫ్లైట్‌లో మీ పక్కన కూర్చున్న వ్యక్తి కావచ్చు. ఓ సినిమా కావచ్చు. అది మీ జీవితాన్నే మార్చేయచ్చు. అవకాశం ఎక్కడ నుండి ఎలా వస్తుందో తెలియదు. చాలాసార్లు అది అవకాశం అనే విషయం మనకు తెలియదు. అది తెలియాలంటే జీవితంలో ఎలర్ట్‌గా, జాగురుకతతో ఉండాలి. కొంతమందికి లక్ష్మీదేవి వచ్చి రోజూ అరుస్తూ తలుపులు బాదుతున్నా వినపడదు.. పందుల్లా నిద్రపోతుంటారు నా కొడుకులు. నా ఫ్రెండ్ ఒకడున్నాడు. చాలా టాలెంటెడ్. వాడొక పుస్తకం రాశాడు.వచ్చిన అవకాశాలను నాశనం చేసుకోవడం ఎలా.. అని. ఆ పుస్తకం వాడి దగ్గరే పెట్టుకుని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాడు. ఇలా చాలా మంది ఉన్నారు. మనల్ని ఎవరూ రెడ్ కార్పెట్ వేసి పిలవడు. మన అవసరాన్ని ఎదుటివాడికి క్రియేట్ చేస్తే బిజీగా ఉంటావు. ప్రారంభంలో నిన్ను అందరూ వాడుకుంటారు. వాడని, అందరూ నిన్ను వాడుతున్నారంటే నువ్వు పనికొస్తున్నావని అర్థం. అన్నీ వాళ్లే నేర్పుతారు. నేర్చుకో. మన టైం బాగుంటే దొంగనాకొడుకులంతా లైఫ్‌లో ముందే తగులుతారు" అని పూరి 'వన్ మూమెంట్' మీకోసం....