Abn logo
Nov 14 2020 @ 19:04PM

మనిషి నెత్తిపై ఇన్ని త్యాగాలా..చచ్చేంత వరకు బరువులు మోయొద్దు: పూరీ జగన్నాథ్

"కాకి నాలుగు గుడ్లు పెట్టి, నాలుగు రోజులు సాకుతుంది. రెక్కలు రాగానే అవి ఎగిరిపోతాయి. ప్రపంచంలో అన్నీ జీవులు ఇలానే చేస్తాయి. నడిచేంత వరకు, రెక్కలు వచ్చేంత వరకు ఇలాగే చేస్తాయి" అని అంటున్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన శాక్రిఫైస్ (త్యాగం) అనే అంశం గురించి మాట్లాడుతూ "ఇతరు జీవులు త్యాగంగా వాటి పనిని ఫీల్‌ కావు. మనం మాత్రం.. పిల్లలు, వాళ్ల  చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, మళ్లీ వాళ్లకి పరుళ్లు, పెంపకాలు, మళ్లీ పెళ్లిళ్లు.. ఇలా అపరిమితమైన పనులు పెట్టుకున్నాం. జీవితమంతా త్యాగాలే. అందుకే తల్లిదండ్రులు మా జీవితాలు త్యాగం చేశాం. మీరు చేయరా! అంటారు. వాళ్ల కోసం పిల్లలు బయలుదేరుతారు. వాళ్ల త్యాగాలు మొదలవుతాయి. చర్చి, గుడి, మసీదు ఇలా ఏదైనా తాగ్యాన్ని కోరుకుంటుంది. బుద్ధుడు, మదర్‌ థెరిస్సా, లైలా కోసం మజ్ను..ఇలా చదివిన కథలు, చూసిన సినిమాలు అవే" అంటున్న పూరీ మ్యూజింగ్‌ 'శాక్రిఫైస్'‌ మీకోసం.. Advertisement
Advertisement
Advertisement