May 11 2021 @ 13:50PM

పూరి మ్యూజింగ్స్... రాజముడి రైస్

ఒక‌ప్పుడు మ‌న దేశంలో ల‌క్ష రకాల ధాన్యాలుండేవి. రైతుల సంతానం వ్య‌వ‌సాయాన్ని కొన‌సాగించ‌క‌పోవ‌డం వ‌ల్ల క్ర‌మ క్ర‌మంగా వ్య‌వ‌సాయ ధాన్యాల్లోని ర‌కాలు త‌గ్గిపోతూ వ‌చ్చాయ‌ని అంటున్నారు డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌. ఈయ‌న బియ్యంలోని అరుదైన ర‌కం రాజ‌ముడి గురించి మ్యూజింగ్ ద్వారా వివ‌రించారు. ప్ర‌స్తుతం మ‌న దేశంలో ఆరువేల ర‌కాల ధాన్యాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని చెప్పిన పూరి.. రైస్‌లో అతి గొప్ప‌దైన రాజ‌ముడి ర‌కం గురించి వివ‌రించారు. రాజుకు ప‌న్ను క‌ట్ట‌ని రైతులు రాజుకు ముడిగా బియ్యాన్ని ట్యాక్స్‌లా క‌ట్టేవార‌ని, అందుక‌నే దానికి రాజ‌ముడి అనే పేరు వ‌చ్చింద‌ని చెప్పిన పూరి త‌న మ్యూజింగ్‌లో రాజ‌ముడి గురించి చెప్పారు. ఆ రాజ‌ముడి రైజ్ మ్యూజింగ్ మీకోసం....