పాలమూరు వీధుల్లో ‘పూరీ జగన్నాథుడు’

ABN , First Publish Date - 2022-07-04T04:35:07+05:30 IST

ఇస్కాన్‌ పాలమూరు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో జగన్నాథ రథయాత్ర ఊరేగింపు కొనసాగింది.

పాలమూరు వీధుల్లో ‘పూరీ జగన్నాథుడు’
అలంకరించిన రథం

 - ఇస్కాన్‌ పాలమూరు శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన రథయాత్ర

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జూలై 3 : ఇస్కాన్‌ పాలమూరు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో జగన్నాథ రథయాత్ర ఊరేగింపు కొనసాగింది. భజనల మధ్య కొనసాగిన ఊరేగింపు పద్మావతీ కాలనీ కమాన్‌ నుంచి ప్రారంభం అయ్యింది. ఈ ఊరేగింపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా, వివిధ కారణాల మధ్య సాయంత్రం 6 గంట ల సమయంలో ఊరేగింపు ప్రారంభం అయ్యింది. ఈ జగన్నాథ రథయాత్ర ఊరేగింపును మునిసిపల్‌ చైర్మన్‌ కె.సి.నర్సింహులు టెంకాయ కొట్టి ప్రారంభించారు. అంతకుముందు మంత్రి డాక్టర్‌ వీ శ్రీనివాస్‌గౌడ్‌ రథయాత్ర ముందు భక్తులతో కలిసి భజనలు చేశారు. ఊరేగింపులో జగన్నాథుని నూతన వస్త్రాలను వీధుల్లో వేల మందికి ప్రజలకు దర్శనం చేయించారు. ఊరేగిం పు మార్గంలో రోడ్లపై ప్రలకు ప్రసాదం వితరణ నిర్వహించారు. ఈ ఊరేగింపు పద్మావతీ కాలనీ కమాన్‌ నుంచి ప్రారంభం అయ్యి మెట్టుగడ్డ, న్యూటౌన్‌, న్యూబస్టాండ్‌, అశోక్‌ టాకీస్‌ చౌరస్తా, వన్‌టౌన్‌ లైబ్రరీ, రామ్‌మందిర్‌ చౌరస్తా, గడియారం చౌరస్తా, పాత బస్టాండ్‌, తెలంగాణ చౌరస్తా రైల్వే స్టేషన్‌, శెట్టి కాంప్లెక్స్‌, టీటీడీ కల్యాణ మంటపం వరకు కొనసాగింది. కల్యాణ మంటపం దగ్గర రాత్రి భోజన ప్రసాదం నిర్వహించారు.



Updated Date - 2022-07-04T04:35:07+05:30 IST