Abn logo
Apr 3 2020 @ 19:00PM

పూరీ రాస్తున్న స్టోరీ మెగా హీరో కోసమేనా?

Kaakateeya

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి ముందుగా పూరి జగన్ పేరే వినిపించింది. స్ర్కిఫ్ట్ కూడా దాదాపు పూర్తయి, సినిమా సెట్స్ మీదకి వెళుతుందనే వార్తలు వచ్చిన తరుణంలో.. సడెన్‌గా చిరంజీవి సెకండాఫ్ స్ర్కిఫ్ట్ నచ్చలేదని స్టేట్‌మెంట్ ఇచ్చి పూరినీ షాక్‌కి గురి చేశాడు. తర్వాత ఈ విషయంలో స్ర్కిఫ్ట్ నచ్చకపోతే నాతో చెప్పాల్సింది.. అంటూ పూరి తన నిరాశను వ్యక్తపరిచాడు. ఆ తర్వాత ఎప్పటికైనా మెగాస్టార్‌ని డైరెక్ట్ చేస్తానంటూ, అది తన గోల్‌గా పూరి చెప్పి ఉన్నాడు.


ప్రస్తుతం కరోనా సమస్యతో లాక్‌డౌన్ నడుస్తున్న తరుణంలో ఇంటికే పరిమితమైన పూరి ఓ స్టార్ హీరో కోసం స్టోరీ రెడీ చేస్తున్నట్లుగా ఓ వీడియో మెసేజ్‌లో తెలిపాడు. అయితే పూరి చెప్పిన స్టార్ హీరో ఎవరా అని అందరూ తలో రకంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘పైసావసూల్’ చిత్ర సమయంలో మరోసారి బాలయ్యని డైరెక్ట్ చేస్తానని పూరి చెప్పడంతో.. పూరి చెప్పిన ఆ స్టార్ హీరో బాలయ్యే అని అంతా అనుకుంటున్నారు. కానీ పూరి రాస్తున్న స్టోరీ మెగాస్టార్ చిరంజీవి కోసమే అనే కొత్త టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తుంది. తను రెడీ చేస్తున్న స్టోరీ.. అయితే మెగాస్టార్ లేదంటే పవర్ స్టార్ అనే ఆప్షన్‌తో పూరి రెడీ చేస్తున్నాడట. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఖచ్చితంగా పూరీ రాస్తున్న స్టోరీ మెగా హీరో కోసమే అని టాక్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది.

Advertisement
Advertisement
Advertisement