Abn logo
Oct 17 2020 @ 16:29PM

కేజీఎఫ్ స్టార్‌తో పూరీ?

Kaakateeya

`కేజీఎఫ్` సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు కన్నడ హీరో యశ్. ప్రస్తుతం యశ్  `కేజీఎఫ్-2`లో నటిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్ ఈ మధ్యనే తిరిగి ప్రారంభమైంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో యశ్ ఓ సినిమా చేయబోతున్నాడట. 


ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే యశ్‌కు పూరీ కథ వినిపించాడని, యశ్‌కు ఆ స్టోరీ బాగా నచ్చిందని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా  పూరీ `ఫైటర్` సినిమా రూపొందిస్తున్నాడు. ఇది పూర్తవగానే యశ్ సినిమా పనులు మొదలు పెడతాడని సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement