Advertisement

‘లైగ‌ర్’ సెట్లో పూరి బర్త్‌డే సందడి.. పిక్స్ వైరల్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ - డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న క్రేజీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్‌. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రోజు(సెప్టెంబ‌రు 28) డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా లైగ‌ర్ సెట్లో పూరి పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుక‌ల్లో చిత్ర యూనిట్ స‌మక్షంలో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేశారు పూరి జ‌గ‌న్నాధ్‌. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. చార్మి, విజయ్ దేవరకొండ వంటి వారు ఈ వేడుకల్లో సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 


మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement