Abn logo
Sep 25 2020 @ 00:32AM

ప్రజల భాగస్వామ్యంతోనే స్వఛ్చ జగిత్యాల

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌


జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 24 : ప్రజల భాగస్వా మ్యంతోనే స్వఛ్చ జగిత్యాల సాధ్యమువుతుందని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. పట్టణ శివారులోని నర్సింగా పూర్‌లో రూ. 54 లక్షల నిధులతో నిర్మించనున్న పొడి చెత్త వనరుల సేకరణ కేంద్రం పనులకు, రహదారి నిర్మాణ ప నులకు జగిత్యాల బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణితో క లిసి ఎమ్మెల్యే గురువారం భూమి పూజ, శంకుస్థాపన చే శారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ మారుతీ ప్రసాద్‌, డీ ఈ లచ్చిరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత కేసీఆర్‌దే

సారంగాపూర్‌ : కరోనా కష్టకాలంలోనూ రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం మండల కేంద్రలంలో గల కస్తూరిభా బాలికల పాఠశాలలో 121 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కు లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 13 మంది లభ్దిదారు లకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. అనంతరం కో నాపూర్‌ గ్రామంలో రూ.2.76 డీఎమ్‌ఎఫ్‌ నిధులతో నిర్మిం చనున్న అంబేద్కర్‌ సంఘ భవనానికి భూమి పూజ చేశా రు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కోల జమున శ్రీనివాస్‌, జడ్పీ టీసీ మనోహర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సొల్లు సురేందర్‌, సహకా ర సంఘం అధ్యక్షులు మల్లారెడ్డి, నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు ఫోరం అధ్యక్షులు గుర్రాల రాజేందర్‌రెడ్డి, తహసీల్దార్‌, నాగ ర్జున, ఎంపీడీవో పుల్లయ్య, సర్పంచ్‌లు, రమణరావు, డిల్లీ రామారావు, రాజన్న, జమున,  జయ, శ్రీలత,  వెంకటేష్‌, లక్ష్మి, రమేష్‌, ఎంసీటీసీలు సుఽధాకర్‌రావు, ప్రసన్న మాల, లావణ్య, నాయకులు శేఖర్‌గౌడ్‌, వంశీ, పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement