కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-25T05:19:41+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అలం పూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అబ్రహాం

- అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

ఎర్రవల్లి చౌరస్తా, మే 24 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అలం పూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. ఇటిక్యాల మం డలంలోని మునుగాల గ్రామంలో మంగళవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొం దాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచు జయలక్ష్మీ, లక్ష్మీనారాయణరెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రంగారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


‘కార్పొరేట్‌’కు దీటుగా సర్కార్‌ బడులు

కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠ శాలల్లో ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తోం దని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. ఇటిక్యాల మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన ‘మనఊరు - మనబడి’ పనులను ప్రారంభించారు. ధర్మవరంలో రూ.16.74 లక్షలు, రాజశ్రీగార్లపాడులో రూ.19.1 లక్షలు, పుటాన్‌దొడ్డిలో రూ.18.91లక్షలు, బుడ్డారెడి ్డపల్లిలో రూ.17.26 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు నకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పనులను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు మధునాయుడు, పద్మ, ఎర్రన్న, రవీందర్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, మల్లన్న, గోవర్దన్‌రెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రంగారెడ్డి, మల్లేష్‌, లూథరన్న, ఇస్మాయిల్‌, హుసేన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:19:41+05:30 IST