ఐఎస్‌ఐ మార్క్‌ ఉన్న వస్తువులనే కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2022-05-18T07:08:06+05:30 IST

ఐఎస్‌ఐ మార్క్‌ ఉన్న వస్తువులనే కొనుగోలు చేసేలా వినియోగదారులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు అన్నారు.

ఐఎస్‌ఐ మార్క్‌ ఉన్న వస్తువులనే కొనుగోలు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు

అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 17:  ఐఎస్‌ఐ మార్క్‌ ఉన్న వస్తువులనే కొనుగోలు చేసేలా వినియోగదారులకు అవగాహన కల్పించాలని  అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వినియోగాదారులు ఐఎస్‌ఐ హాల్‌ మార్క్‌ వస్తువుల వినియోగంపై బ్యూరో ఆఫ్‌ ఇండి యన్‌ స్టాండర్స్‌ శాస్త్రవేత్తలు, జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భారతీయ ప్రమాణాల సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌ శివప్రసాద్‌తో కలసి ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులకు వస్తువుల నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించాలని సూచించారు. బీఐఎస్‌ కేర్‌ యాప్‌ ద్వారా ఐఎస్‌ఐ మార్క్‌ ఉన్న వస్తువుల లైసెన్సు, తయారీదారుల వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. అనంతరం శాస్త్రవేత్త అవినాష్‌బాబు హాల్‌మార్క్‌ గురించి అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఆండ్‌బీ  ఈఈ యాకుబ్‌, ఏడీఏ రామారావునాయక్‌, డీఎస్‌వో విజయలక్ష్మి, సంక్షేమ  అధికారులు శంకర్‌, జ్యోతిపద్మ, అనసూర్య, దయానందరాణి, డీఎంహెచ్‌వో కోటాచలం, స్టాండర్డ్‌ ప్రమోటింగ్‌ అధికారులు అభిసాయి, ఉద్యో గులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-18T07:08:06+05:30 IST