‘పత్తి’ కి మద్దతు ధరకు కొనుగోలు : భాస్కర్‌రావు

ABN , First Publish Date - 2022-10-02T06:25:05+05:30 IST

పత్తిపంటకు ప్రైవేటు మార్కెట్‌లో మద్దతు ధర ల భించకుంటే నాణ్యతా ప్రమాణాల మేరకు తగిన ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు సి ద్ధంగా ఉన్నారని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు.

‘పత్తి’ కి మద్దతు ధరకు కొనుగోలు : భాస్కర్‌రావు
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌

నల్లగొండటౌన, అక్టోబరు 1:  పత్తిపంటకు ప్రైవేటు మార్కెట్‌లో మద్దతు ధర ల భించకుంటే నాణ్యతా ప్రమాణాల మేరకు తగిన ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు సి ద్ధంగా ఉన్నారని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పత్తి కొనుగోళ్లపై ఏజేసీ నిర్వహించిన స మీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 6లక్షల41వేల302 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 51లక్షల64వేల757 క్వింటాళ్ల పత్తి దిగుబడి రానుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని తెలిపారు. అక్టోబరు 15 నుంచి పత్తి కొనుగోలుకు మార్కెటింగ్‌, సీసీఐ అధికారులు సిద్ధంగా ఉండాలని ఇందుకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పత్తికి మద్దతు ధర రాకుంటే రూ.6,380 క్వింటాల్‌కు ధర చెల్లించి  కొను గోలు చేసేందుకు సీసీఐ అధికారులు సిద్ధంగా ఉన్నా రని తెలిపారు. అగ్నిమాపక శాఖ, తూనికలు కొల త ల శాఖల అధికారులు జిన్నింగ్‌ మిల్లులు, వేబ్రిడ్జి ల ను తనిఖీ చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మార్కెటింగ్‌ అధికారి శ్రీకాంత, డీఏవో సుచరిత, తూనికల కొలతలశా ఖ ఇనస్పెక్టర్‌ రామకృష్ణ, జి న్నింగ్‌ మిల్లుల అధికారులు, సీ సీఐ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-02T06:25:05+05:30 IST