2.35లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2022-05-20T05:53:20+05:30 IST

జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 2,35,539 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొను గోలు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వీ.వెంకటేశ్వర్లు తెలిపారు.

2.35లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు
నార్కట్‌పల్లి: అక్కెనపల్లిలో ధాన్యం ఎగుమతులు పరిశీలిస్తున్న డీఎస్‌వో వెంకటేశ్వర్లు

డీసీఎస్‌వో వెంకటేశ్వర్లు 

నార్కట్‌పల్లి/మునుగోడు రూరల్‌, మే 19:  జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 2,35,539 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొను గోలు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వీ.వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని అక్కెనపల్లి, నెమ్మాని గ్రామాల్లో నార్కట్‌పల్లి పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఽధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం సందర్శించారు. ఈ సంధర్భంగా ఆయన మాటా డుతూ ధాన్యం కొనుగోలు కింద జిల్లాలో 16,690 మంది రైతులకు ఇప్పటి వరకు రూ.228.07 కోట్లు రైతుల బ్యాంకుల ఖాతాల్లో వేశామని తెలిపారు. జిల్లాలో గత సీజన్‌లో ఎకరాకు 28 క్వింటాళ్ల వరి ఽధాన్యం పండగా అది ఈ సారి 32క్వింటాళ్లకు పెరిగిందని ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం కొను గోళ్లను వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచుకోవాలన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని కేంద్రానికి కేటాయించిన మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించా లని ఆదేశించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, కాంటా వేసి మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను నిర్వహకులను అడిగి తెలు సుకున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడే అవకాశము న్నందున వీలైనంత వేగంగా ధాన్యం కాంటా వేసి మిల్లులకు తరలించా లని, కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం రాశులపై టార్పాలిన్‌లు కప్పి వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవా లని ఆయన సూచించారు.  ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లారీల ద్వారా ధాన్యం ఎగుమతి చేసే వారు డబ్బులు డిమాండ్‌ చేస్తే రైతులు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ 9663407064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. డీసీఎస్‌వో వెంట పీఏసీఎస్‌ చైర్మన్‌ కసిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, సీఎస్‌ ఆర్‌ఐ స్వామి   మునుగోలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. 

Updated Date - 2022-05-20T05:53:20+05:30 IST