పొత్తులపై నిర్ణయం బీజేపీ హైకమాండ్‌దే: పురంధేశ్వరి

ABN , First Publish Date - 2022-06-05T18:06:16+05:30 IST

పొత్తులపై నిర్ణయం బీజేపీ హైకమాండ్‌దేనని ఆ పార్టీ నేత పురంధేశ్వరి ప్రకటించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ

పొత్తులపై నిర్ణయం బీజేపీ హైకమాండ్‌దే: పురంధేశ్వరి

అమరావతి: పొత్తులపై నిర్ణయం బీజేపీ హైకమాండ్‌దేనని ఆ పార్టీ నేత పురంధేశ్వరి ప్రకటించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, జనసేన మధ్య ఎలాంటి గ్యాప్ లేదని తెలిపారు. క్షేత్ర స్థాయిలో మాత్రం కొంత గ్యాప్ ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేస్తాయని పురంధేశ్వరి ప్రకటించారు. ఏపీలో పొత్తులపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఈ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ముగింపు ప్రసంగం చేశారు. ‘ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని ఇప్పటికే స్పష్టం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌... తాజాగా పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘వచ్చే ఎన్నికల్లో మాకు మూడు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది... బీజేపీతో కలిసి ప్రభుత్వ స్థాపన. రెండు... బీజేపీ, టీడీపీలతో కలిసి అధికారంలోకి రావడం. మూడు... జనసేన ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం’’ అని పవన్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-05T18:06:16+05:30 IST