కుక్కపిల్ల మిస్సింగ్‌.. పీఎస్‌లో ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-06-28T17:12:43+05:30 IST

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్క పిల్ల (పప్పీ)తప్పిపోయిందని దంపతులు పంజాగుట్ట పోలీ్‌సేస్టషన్‌లో ఫిర్యాదు చేశారు. అమీర్‌పేట నాగార్జుననగర్‌కు చెందిన దంపతులు

కుక్కపిల్ల మిస్సింగ్‌..  పీఎస్‌లో ఫిర్యాదు

హైదరాబాద్/పంజాగుట్ట: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్క పిల్ల (పప్పీ)తప్పిపోయిందని దంపతులు పంజాగుట్ట పోలీ్‌సేస్టషన్‌లో ఫిర్యాదు చేశారు. అమీర్‌పేట  నాగార్జుననగర్‌కు చెందిన దంపతులు రెండు నెలల వయస్సు ఉన్న కుక్కపిల్ల(పప్పీ)ని పెంచుకుంటున్నారు. ఈ నెల 26న ఆ కుక్కపిల్ల ఆడుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి రహదారిపై అటూ ఇటూ తిరుగుతుండగా హోండా ఆక్టీవాపై వచ్చిన వారు దానిని గుర్తించారు. దగ్గర్లో ఎవరూ లేకపోవడంతో తీసుకెళ్లిపోయారు. కొద్ది ేసపటి తరువాత యజమానులు ఇంట్లో కుక్కపిల్ల లేదని గుర్తించి, ఇంట్లో, బయట వెతికారు. సీసీ కెమెరాలను పరిశీలించగా హోండా ఆక్టీవా వాహనం పై వచ్చిన వారు తీసుకెళ్లినట్లు గుర్తించి అదే రోజు రాత్రి పంజాగుట్ట పీఎ్‌సలో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, వాహనం నెంబర్‌ గురించి ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2022-06-28T17:12:43+05:30 IST