పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.. ప్రిన్స్‌ హ్యారీ అరెస్టుకు వారెంట్ ఇవ్వండి: పంజాబ్‌ యువతి

ABN , First Publish Date - 2021-04-14T13:25:12+05:30 IST

‘బ్రిటన్‌ రాజరిక కుటుంబానికి చెందిన ప్రిన్స్‌ హ్యారీ నన్ను పెళ్లి చేసుకుంటానని బాసలు చేశాడు. కానీ, మాట తప్పాడు. కాబట్టి ప్రిన్స్‌ హ్యారీని తక్షణమే అరెస్టు చేసేందుకు వారెంట్‌ జారీ చేయండి’ అంటూ ఒక మహిళ పంజాబ్‌-హరియాణ హైకోర్టును ఆశ్రయించింది.

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.. ప్రిన్స్‌ హ్యారీ అరెస్టుకు వారెంట్ ఇవ్వండి: పంజాబ్‌ యువతి

పెళ్లికి ముఖం చాటేశారంటున్న పంజాబ్‌ యువతి

పగటి కలలు కనొద్దు: హైకోర్టు హితవు

చండీగఢ్‌, ఏప్రిల్‌ 13: ‘బ్రిటన్‌ రాజరిక కుటుంబానికి చెందిన ప్రిన్స్‌ హ్యారీ నన్ను పెళ్లి చేసుకుంటానని బాసలు చేశాడు. కానీ, మాట తప్పాడు. కాబట్టి ప్రిన్స్‌ హ్యారీని తక్షణమే అరెస్టు చేసేందుకు వారెంట్‌ జారీ చేయండి’ అంటూ ఒక మహిళ పంజాబ్‌-హరియాణ హైకోర్టును ఆశ్రయించింది. విచిత్రమైన ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన హైకోర్టు విస్తుబోయింది. వ్యాజ్యం వేసిన మహిళ పల్విందర్‌ సింగ్‌ పగటి కలలు కంటున్నారని, దీనికి విచారణార్హత లేదంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. న్యాయవాది అయిన పిటిషనర్‌ తన కేసును తానే వాదించుకున్నారు. తాను ఎన్నడూ బ్రిటన్‌కు వెళ్లి ప్రిన్స్‌ హ్యారీని కలవలేదని, అతనితో తనకు సోషల్‌ మీడియా ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయని పిటిషనర్‌ కోర్టుకు చెప్పారు. బోగస్‌ ఈ-మెయిళ్లను నిజమని నమ్మిన పిటిషనర్‌పై సానుభూతి చూపించడం వినా తామేమీ చేయలేమని జస్టిస్‌ అరవింద్‌ సింగ్‌ సాంగ్వాన్‌ వ్యాఖ్యానించారు. పిటిషనర్‌ వేసిన వ్యాజ్యం, తనకు ప్రిన్స్‌ హ్యారీ పంపినట్లుగా పిటిషనర్‌ చెప్పుకుంటున్న ఈ-మెయిళ్లలోని భాషలో చాలా దోషాలు ఉన్నాయని జడ్జి పేర్కొన్నారు. ‘‘ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో అనేక బోగస్‌ ఐడీలను సృష్టిస్తున్నారు. హ్యారీ పేరిట పంజాబ్‌లోని ఏదైనా ఊళ్లోని సైబర్‌ కేఫ్‌ నుంచి కూడా ఈ-మెయిళ్లు పంపే అవకాశాలు ఉన్నాయి’’ అని జడ్జి అన్నారు. 

Updated Date - 2021-04-14T13:25:12+05:30 IST