43 IAS, 38 PCS అధికారుల్ని transfer చేసిన Punjab

ABN , First Publish Date - 2022-05-04T22:50:41+05:30 IST

ఇదే సమయంలో కొంత మంది సీనియర్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రధాన పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ బదిలీ ఉత్తర్వులు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది..

43 IAS, 38 PCS అధికారుల్ని transfer చేసిన Punjab

చండీగఢ్: ఒకేసారి 43 మంది IAS(Indian Administrative Service), 38 మంది PCS (Provincial Civil Service) అధికారుల్ని బదిలీ చేస్తూ భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజబ్ ప్రభుత్వం బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కొంత మంది సీనియర్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రధాన పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ బదిలీ ఉత్తర్వులు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. కొద్ది రోజుల క్రితం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన భగవంత్ మాన్ ఇప్పటి వరకు తీసుకున్న పెద్ద నిర్ణయాల్లో ఇదొకటని అంటున్నారు.

Read more