Abn logo
May 29 2020 @ 15:37PM

పంజాబ్ నుంచి శ్రామిక్ రైళ్ల నిలిపివేత, అవసరమైతే నడిపేందుకు సన్నాహాలు

చండీగఢ్ : డిమాండ్ తగ్గడంతో పంజాబ్‌ నుంచి శ్రామిక్ రైళ్ళను శుక్రవారం నుంచి నిలిపేశారు. అవసరమైతే మళ్ళీ నడిపేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. 


పంజాబ్ కోవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి రాహుల్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం,  పంజాబ్ నుంచి ఇప్పటి వరకు 375 శ్రామిక్ రైళ్ళు వివిధ రాష్ట్రాలకు వలస కార్మికులను చేరవేశాయి. గురువారం పంజాబ్ నుంచి 10 శ్రామిక్ రైళ్ళు ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు బయల్దేరాయి. వీటిలో 9 రైళ్ళు లూధియానా నుంచి, ఒక రైలు ఫిరోజ్ పూర్ నుంచి బయల్దేరాయి. 


ఇప్పటి వరకు 5.31 లక్షల మందిని పంజాబ్ నుంచి వేర్వేరు రాష్ట్రాలకు చేరవేశాయి. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు 4.83 లక్షల మందిని తీసుకెళ్ళాయి. 


788 బస్సుల్లో 23,006 మందిని పంజాబ్ నుంచి ఇతర ప్రాంతాలకు పంపించారు. రైళ్ళు, బస్సుల ద్వారా ప్రజలను పంపించేందుకు ఇప్పటి వరకు పంజాబ్ ప్రభుత్వం రూ.26 కోట్లు ఖర్చు చేసింది. 


విమానాల ద్వారా 3,172 మంది రాష్ట్రం నుంచి వెళ్ళారు, ఈ ఖర్చులను ప్రయాణికులే స్వయంగా భరించారు. ప్రైవేటు వాహనాల ద్వారా 21,948 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళినట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి.




Advertisement
Advertisement
Advertisement