Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 21 Sep 2022 20:40:05 IST

Punjab Prisons: ఖైదీలకు పంజాబ్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. జైళ్లలోనే భార్యలతో ఏకాంతంగా గడిపేందుకు ఛాన్స్.. కానీ, షరతు ఏంటంటే..

twitter-iconwatsapp-iconfb-icon
Punjab Prisons: ఖైదీలకు పంజాబ్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. జైళ్లలోనే భార్యలతో ఏకాంతంగా గడిపేందుకు ఛాన్స్.. కానీ, షరతు ఏంటంటే..

జైలు జీవితం అంటే ఎవరికైనా మరచిపోలేని చేదు జ్ఞాపకమే. వివిధ పరిస్థితుల్లో నేరాలు చేసిన వారిని సంస్కరించడం కోసమే జైలు శిక్ష విధిస్తుంటారు. ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు ప్రభుత్వాలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. దీనిలో భాగంగా పంజాబ్ ప్రభుత్వం (Punjab Government) ఓ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఆ చట్టం ప్రకారం ఇకపై ఖైదీలు జైళ్లలోనే తమ జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడపొచ్చు. అయితే దీనికి కొన్ని షరతులున్నాయి. 


ఇది కూడా చదవండి..

వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని ప్రియుడిపై ఆగ్రహం.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

జైలులో ఉన్న ఖైదీతో అతని జీవిత భాగస్వామి కొన్ని గంటలపాటు ఏకాంతంగా గడిపేందుకు (Conjugal Visits) అవకాశం ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ అవకాశం అందరికీ కాదు. కేవలం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు ప్రతి మూడునెలలకు ఒకసారి తమ భార్యలను ఏకాంతంగా కలుసుకోవచ్చు. సుదీర్ఘ కాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి మొదట అవకాశం కల్పిస్తారు. దీనికోసం జైలులో ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తారు. రెండు గంటలపాటు వీరిని ఏకాంతంగా ఉండనిస్తారు. కరడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్‌స్టర్‌లు, లైంగిక నేరాల్లో శిక్ష అనుభవిస్తున్నవారికి మాత్రం ఈ సదుపాయాన్ని కల్పించరు.


తొలుత ఈ విధానాన్ని గోయింద్వాల్‌ సాహిబ్‌లో ఉన్న కేంద్ర కరాగారం, నభాలోని నూతన జిల్లా జైలుతోపాటు భఠిండాలోని మహిళా జైళ్లలో అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర జైళ్లశాఖ వెల్లడించింది. జైలులో ఉన్న తమ భాగస్వామితో ఏకాంతంగా గడపాలి అనుకునేవారు మ్యారేజ్ సర్టిఫికెట్‌తో పాటు కోవిడ్, లైంగిక సంబంధ రోగాలు, ఇతర అంటువ్యాధులు లేవని వైద్యుడి నుంచి ధ్రవీకరణ పత్రం తీసుకుని రావల్సి ఉంటుంది. మొత్తం మీద ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు పంజాబ్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మరి, ఈ నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తుందో, లేదో వేచి చూడాలి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.