Tiffin Bomb: ఇండో-పాక్ సరిహద్దుల్లో కలకలం

ABN , First Publish Date - 2021-11-05T15:20:36+05:30 IST

దీపావళి సందర్భంగా ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో దాచిన పేలుడు పదార్థాలతో నిండిన టిఫిన్ బాక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...

Tiffin Bomb: ఇండో-పాక్ సరిహద్దుల్లో కలకలం

చండీగఢ్: ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో దాచిన పేలుడు పదార్థాలతో నిండిన టిఫిన్ బాక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దీంతో ఉగ్రదాడి ప్రయత్నాన్ని విఫలం చేసినట్లు పంజాబ్ పోలీసులు చెప్పారు.జలాలాబాద్ పేలుడు కేసుకు సంబంధించి ఈ వారం ప్రారంభంలో ముగ్గురిని అరెస్టు చేసి విచారించగా టిఫిన్ బాక్సు బాంబు బాగోతం బయటపడింది.అలీ కే గ్రామంలో టిఫిన్ బాక్సు బాంబు రికవరీ చేశారు.నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్న జలాలాబాద్ పేలుళ్ల కేసులో నిందితుడు రంజీత్ సింగ్ అలియాస్ గోరాకు ఆశ్రయం కల్పించినందుకు ఇద్దరు వ్యక్తులను లూథియానా రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటా తెలిపారు. 


ముగ్గురు వ్యక్తుల నుంచి టిఫిన్ బాంబుతోపాటు రెండు పెన్ డ్రైవ్ లు, రూ.1.15లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గత కొన్ని నెలలుగా అమృత్‌సర్ రూరల్, కపుర్తలా, ఫాజిల్కా, తరన్ తరణ్‌ ప్రాంతాల్లో టిఫిన్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు.అమృత్‌సర్‌లోని ఇండో-పాక్ సరిహద్దులో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ తో నిండిన డబుల్ డెక్కర్ టిఫిన్ బాక్స్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. దీంతో  స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఒక పెద్ద ఉగ్రదాడి ప్రయత్నాన్ని పంజాబ్ పోలీసులు విఫలం చేశారు.


Updated Date - 2021-11-05T15:20:36+05:30 IST