పంజాబ్ యువకునికి జైలు శిక్ష విధించిన బ్రిటన్ కోర్టు..!

ABN , First Publish Date - 2020-07-04T01:51:35+05:30 IST

పంజాబ్‌కు చెందిన 28ఏళ్ల పర్విందర్ సింగ్‌కు బ్రిటన్‌ కోర్టు 34నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని లీసెస్టర్ వాణిజ్య సముదాయం

పంజాబ్ యువకునికి జైలు శిక్ష విధించిన బ్రిటన్ కోర్టు..!

లండన్: పంజాబ్‌కు చెందిన 28ఏళ్ల పర్విందర్ సింగ్‌కు బ్రిటన్‌ కోర్టు 34నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని లీసెస్టర్ వాణిజ్య సముదాయంలో గత ఏడాది జనవరిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగనప్పటికీ.. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాణిజ్య కేంద్రంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. పర్విందర్ సింగే.. వాణిజ్య కేంద్రంలో నిప్పు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడ్ని గత ఏడాది అక్టోబర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసును విచారించిన కోర్టు.. పర్విందర్ సింగ్ నేరానికి పాల్పడ్డట్లు నిర్ధారించింది. పర్విందర్ సింగ్ కూడా నేరాన్ని అంగీకరించడంతో.. అతనికి కోర్టు 34నెలల జైలు శిక్ష విధించింది. 


Updated Date - 2020-07-04T01:51:35+05:30 IST